Alia Bhatt: విలన్ గా అలియా భట్ .. నెక్ట్ ఫ్లిక్స్ వేదికపైకి 'హార్ట్ ఆఫ్ స్టోన్'

Heart Of Stone movie update

  • హాలీవుడ్ ఓటీటీ మూవీగా 'హార్ట్ ఆఫ్ స్టోన్'
  • నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ 
  • ప్రధానమైన పాత్రలలో గాల్ గ్యాడోట్ - అలియా 
  • స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ

బాలీవుడ్ బ్యూటీగా అలియా భట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. గ్లామర్ పరంగానే కాదు .. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె దూసుకుపోతోంది. తన దూకుడును బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దిశగా కొనసాగించింది. హాలీవుడ్ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో ఆమె విలన్ రోల్ ను పోషించింది. 

భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. దేశానికి ఎదురైన ఒక ప్రమాదాన్ని తప్పించడానికి గాల్ గ్యాడోట్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ టీమ్ ప్రయత్నాలకు అడ్డుపడుతూ అడుగడుగునా సవాళ్లు విసిరే విలన్ పాత్రలో అలియా కనిపించనుంది. యాక్షన్ సీన్స్ లోను ఆమె ప్రేక్షకులను అలరించనుంది. 

ఈ మూవీ కోసం అలియా అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ నెల 11న రానుంది. ఇంగ్లిష్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలా తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

Alia Bhatt
Gal Gadot
Jamie Dornon
Heart Of Stone
  • Loading...

More Telugu News