Shankar: 'గేమ్ ఛేంజర్'పై వినిపిస్తున్న రూమర్ ఇదే!

Game Changer movie update

  • చరణ్ హీరోగా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్'
  • షూటింగు దశలో ఉన్న ప్రాజెక్టు 
  • బడ్జెట్ విషయంలో దిల్ రాజు టెన్షన్ 
  • శంకర్ తీరు పట్ల అసంతృప్తి అంటూ టాక్  

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ హీరోగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో పాటు శంకర్ 'ఇండియన్ 2' కూడా చేస్తుండటం వలన, షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. 

అయితే 'గేమ్ ఛేంజర్' విషయంలో శంకర్ తో దిల్ రాజుకి పొసగడం లేదనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. భారీగా ఖర్చు చేయించిన కొన్ని సీన్స్ అవుట్ పుట్ ను శంకర్ పక్కన పడేస్తున్నాడట. దాంతో ఖర్చు అనుకున్నదానికంటే ఎక్కువవుతోంది. పర్ఫెక్ట్ ప్లానింగుతో ముందుకు వెళుతున్న దిల్ రాజుకి ఇది నచ్చడం లేదని అంటున్నారు. 

దిల్ రాజుకి నిర్మాతగా ఇది 50వ సినిమా. అందువలన అతికష్టం మీద శంకర్ ధోరణిని భరిస్తున్నాడని అంటున్నారు. శంకర్ గొప్ప దర్శకుడే .. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంతవరకూ ఆయన తమిళంలోనే తప్ప తెలుగు నిర్మాతలతో పని చేయలేదు. ఇక ఆయన 'రోబో 2.0' .. 'ఇండియన్ 2' సినిమాల నుంచే నిర్మాతల వైపు నుంచి అసంతృప్తిని ఎదుర్కున్నాడు. మరి 'గేమ్ ఛేంజర్' కు సంబంధించిన విషయంలో నిజమెంతనేది చూడాలి.

Shankar
Dil Raju
Ram Charan
Game Changer Movie
  • Loading...

More Telugu News