Pawan Kalyan: దిల్ రాజు అండ్ టీమ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan congrats Dil Raju team

  • చిత్ర పరిశ్రమను విజయవంతంగా నడిపించాలని విజ్ఞప్తి
  • తెలుగు చిత్ర పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా పని చేస్తారని ఆశాభావం
  • వాణిజ్యపరంగా తెలుగు సినిమాను మరింత విస్తృతం చేయాలని సూచన

వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి, కోట్ల సంపదను సినిమా సృష్టిస్తోందని, అలాంటి చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలిని విజయవంతంగా నడిపించాలని పవన్ కల్యాణ్ అన్నారు. జులై 30న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగగా, అధ్యక్షుడిగా దిల్ రాజు విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ గెలిచారు. రెండేళ్ల పాటు వీరు పదవిలో వుంటారు. 

ఇదిలావుంచితే, ఫిల్మ్ ఛాంబర్‌కు ఎన్నికైన నూతన కార్యవర్గానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
అధ్యక్షుడు దిల్ రాజు, సహా అందరూ మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గం పని చేస్తుందని ఆకాంక్షించారు. తెలుగు సినిమాస్థాయి వాణిజ్యపరంగా విస్తృతమవుతోందని, దీనిని మరింతగా పెంచాలని కార్యవర్గాన్ని కోరారు. ఒక సినిమా నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కోట్ల సంపద సృష్టి జరుగుతుందన్నారు. ఎంతోమంది పన్నులు చెల్లిస్తారని చెప్పారు.

Pawan Kalyan
Dil Raju
Tollywood
Film Chamber
  • Loading...

More Telugu News