Rashi Khanna: అతనితో డేటింగ్ మొదలు పెట్టిన తర్వాతే బరువు తగ్గాను: రాశీ ఖన్నా

Rashi Khanna reveals she is in dating

  • గతంలో ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానన్న రాశి
  • ఆయనతో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ కు గురై బరువు పెరిగానని వెల్లడి
  • ఇప్పుడు తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడన్న రాశి 

తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్టు ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా వెల్లడించింది. గతంలో తాను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని... అతనితో బ్రేకప్ కావడంతో చాలా డిప్రెషన్ కు గురయ్యానని చెప్పింది. ఈ డిప్రెషన్ కు తోడు థైరాయిడ్ సమస్య కూడా ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయానని తెలిపింది. ఎన్నో వర్కౌట్లు చేసినా బరువు తగ్గలేకపోయానని చెప్పింది. ఈ ఎఫెక్ట్ తన సినిమాలపై కూడా పడిందని చెప్పింది. 

చివరకు తనను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దొరికాడని... అతనితో డేటింగ్ ప్రారంభించిన తర్వాత బరువు తగ్గానని, స్లిమ్ అయ్యానని తెలిపింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం రాశి చెప్పలేదు. సినిమాల విషయానికి వస్తే... ఆమె నటించిన 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' సినిమాలు గత ఏడాది విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం తమిళం, హిందీలో ఆమె సినిమాలు చేస్తోంది. తెలుగులో మాత్రం కొత్త చిత్రాలేమీ చేయడం లేదు.

Rashi Khanna
Tollywood
Bollywood
dating
  • Loading...

More Telugu News