Amani: నాకు బాధ కలిగించే విషయం అదొక్కటే: నటి ఆమని

Amani Interview

  • స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆమని 
  • ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీ 
  • భగవంతుడి దయతోనే కెరియర్ నడిచిందని వ్యాఖ్య
  • తన సక్సెస్ తండ్రి చూడలేదంటూ ఆవేదన

ఆమని .. నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ డమ్ ను అందుకున్న హీరోయిన్. గట్టి పోటీ ఉన్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన ఆమని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా 'ఐ డ్రీమ్స్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. 
 
"నేను సినిమాల్లోకి రావడం మా ఫాదర్ కి ఇష్టం ఉండేది కాదు. కానీ ఆ తరువాత నా ఇష్టాన్ని గమనించి అంగీకరించారు. నేను హీరోయిన్ గా కూడా నిలదొక్కుకోగలనని నమ్మారు. అలాగే నేను 'మిస్టర్ పెళ్ళాం' తరువాత దూసుకుపోయాను. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. హీరోయిన్ గా నా స్టార్ డమ్ ను మా ఫాదర్ చూడలేదనే ఒక బాధ నాకు ఇప్పటికీ ఉంది" అన్నారు. 

"నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లను దాటుకుని నా వరకూ ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పాలి. అలా రావడానికి కారణం భగవంతుడి దయగానే నేను భావిస్తాను. ఇప్పటికీ నేను భగవంతుడినే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను" అని చెప్పుకొచ్చారు. 

Amani
Actress
Tollywood
  • Loading...

More Telugu News