Stock Market: తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 68 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 20 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా నష్టపోయిన పవర్ గ్రిడ్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రియాల్టీ, పీఎస్యూ సూచీలు ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు కోల్పోయి 66,459కి పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్ల స్వల్పం నష్టంతో 19,733కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.07%), టెక్ మహీంద్రా (2.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), టీసీఎస్ (0.87%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-5.11%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.45%), రిలయన్స్ (-1.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.35%).