Reba Monica John: అనూ ఇమ్మాన్యుయేల్ నా సిస్టర్ కాదు: హీరోయిన్ రెబ్బా మోనికా జాన్

Reba Monica John Interview

  • శ్రీవిష్ణు జోడీగా పరిచయమైన రెబ్బా మోనిక జాన్
  • 'సామజవరగమన'తో ఫస్టు హిట్  
  • 'బ్రో' సినిమా చేయలేకపోయానని వెల్లడి 
  • పవన్ సినిమా చేయాలనుందని వ్యాఖ్య

ఈ మధ్య కాలంలో విజయాలను సాధించిన ఫ్యామిలీ ఎంటర్టయినర్ సినిమాలలో 'సామజవరగమన' ఒకటి. ప్రేమ - పెళ్లి అనే రెండు అంశాల చుట్టూ సరదాగా అల్లిన కథ ఇది. మొదటి నుంచి చివరి వరకూ ఈ సినిమా నవ్విస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు జోడీగా రెబ్బా మోనిక జాన్ సందడి చేసింది. 

తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " తెలుగులో నా ఫస్టు మూవీకి ఇంతటి రెస్పాన్స్ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం మా ఫ్యామిలీ బెంగుళూరులో ఉంటున్నప్పటికీ, నేను మలయాళీనే. ఈ సినిమా సమయంలోనే తెలుగు నేర్చుకున్నాను. నేను .. అనూ ఇమ్మాన్యుయేల్ ఓన్ సిస్టర్స్ అనే ప్రచారం జరుగుతోంది. అందులో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే" అని అంది. 

'బ్రో' సినిమాలో సాయితేజ్ సిస్టర్ పాత్రను చేసే ఛాన్స్ నాకు వచ్చింది. కొన్ని కారణాల వలన ఆ సినిమా చేయలేకపోయాను. ఆ ఛాన్స్ మిస్సవ్వడం వలన చాలా ఫీల్ అయ్యాను. పవన్ సినిమాలో చేసే ఛాన్స్ మళ్లీ ఏదో ఒక రోజున వస్తుందనే ఆశ ఉంది. అలా వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. 

Reba Monica John
Sri Vishnu
Samajavaragamana
Movie
  • Loading...

More Telugu News