Urine In Water Bottle: రాజస్థాన్‌లో దారుణం.. విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన బాలురు
- నీళ్లు తాగే క్రమంలో వాసన రావడతో హెడ్మాస్టర్‌కు బాలిక ఫిర్యాదు
- ఆయన పట్టించుకోకపోవడంతో తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు
- చర్యలు లేకపోవడంతో ఆందోళనకు దిగిన బాధిత బాలిక కుటుంబ సభ్యులు
రాజస్థాన్‌లో గత నెల 28న జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని వాటర్ బాటిల్‌లో ముగ్గురు బాలురు మూత్రాన్ని నింపి పెట్టారు. నీటిని తాగే సమయంలో వాసన వస్తుండడంతో బాలిక ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. అయితే, ఆయన పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు తహసీల్దారు, లుహారియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు.
నిందితులైన విద్యార్థుల ఇళ్లలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. బాధిత బాలిక, నిందితులైన బాలురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ ఘటన కాస్తా ఇరు వర్గాల మధ్య పోరులా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులైన ముగ్గురు అబ్బాయిలపై కేసులు నమోదు చేశామని, నిరసనలకు దిగిన వారిలో 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.