akshay kumar: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా ట్యాక్స్ చెల్లించిన వ్యక్తి ఎవరో తెలుసా?

Indias highest taxpayer is Akshay Kumar

  • అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమార్
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.29.5 కోట్ల పన్ను చెల్లింపు
  • రూ.486 కోట్ల ఆదాయాన్ని చూపించిన బాలీవుడ్ నటుడు

దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తిగా బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ నిలిచాడు. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం అక్షయ్ కుమార్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.29.5 కోట్ల పన్నును చెల్లించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.486 కోట్ల ఆదాయాన్ని ఆయన చూపించారు.

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారిలో అక్షయ్ కుమార్ ముందుంటారు. ఆయన ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. దీంతో పాటు ఆయన ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్ ను నిర్వహిస్తున్నారు. అలాగే, ఆయా కంపెనీల వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా ఆయన భారీగానే ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యధిక పన్ను చెల్లింపుదారుగా రూ.25.5 కోట్లతో అక్షయ్ కుమారే ముందున్నారు.

ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామిక దిగ్గజాల పేర్లు ఈ జాబితాలోకి రాకపోవడానికి కారణమూ ఉంది. వీరి ఆస్తులు ఎక్కువగా కంపెనీల పేరిట ఉంటాయి. ఆదాయాలు కూడా అధికంగా కంపెనీల వాటాగా వెళతాయి. కాబట్టి వ్యక్తిగత అత్యదిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమారే గత కొన్నేళ్లుగా ముందు నిలుస్తున్నారు.

akshay kumar
Bollywood
Income Tax
  • Loading...

More Telugu News