YS Jagan: సీఎం జగన్ ను కలిసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్

HRC Chairman Justice M Sitarama Murthy met CM Jagan

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో హెచ్చార్సీ చైర్మన్ భేటీ
  • సీఎం జగన్ కు హెచ్చార్సీ వార్షిక నివేదిక సమర్పణ
  • పలు అంశాలపై సీఎంతో చర్చ

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 2022-23 సంవత్సరానికి గాను రూపొందించిన మానవ హక్కుల కమిషన్ వార్షిక నివేదికను సీఎం జగన్ కు అందజేశారు. ఈ భేటీలో హెచ్చార్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ తో మానవ హక్కుల కమిషన్ కార్యవర్గం పలు అంశాలపై చర్చించింది.

YS Jagan
HRC Chairman
Justice Sitarama Murthy
Andhra Pradesh
  • Loading...

More Telugu News