Varun Tej: విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో 'గాండీవధారి అర్జున' విహారం .. లిరికల్ సాంగ్ రిలీజ్!

Gandeevadhari Arjuna Movie Lyrival Song Released

  • ప్రవీణ్ సత్తారు నుంచి 'గాండీవధారి అర్జున'
  • వరుణ్ తేజ్ జోడీకట్టిన సాక్షి వైద్య
  • యూరప్ దేశాలలో జరిగిన చిత్రీకరణ 
  • సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ 
  • ఆగస్టు 25వ తేదీన సినిమా విడుదల  

మొదటి నుంచి కూడా దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అలా 'గరుడవేగ'తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, వరుణ్ తేజ్ తో మరో భారీ యాక్షన్ మూవీని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. చాలావరకూ ఈ సినిమా షూటింగ్ యూరప్ దేశాలలో జరిగింది. 

ఈ సినిమాకి 'గాండీవధారి అర్జున' అనే టైటిల్ ను సెట్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ స్టైలీష్ లుక్ కూడా ఆకట్టుకుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను, ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.
  
'నీ జతై సాగింది పాదమే .. ఆపినా ఆగునా లోలోని వేగమే' అంటూ ఈ పాట సాగుతోంది. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటను, ఫారిన్ లోని అందమైన లోకేషన్స్ లో హీరో హీరోయిన్ పై చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యే బీట్ తో సాగుతోంది. వరుణ్ తేజ్ సరసన నాయికగా సాక్షి వైద్య నటించగా, కీలకమైన పాత్రను నాజర్ పోషించారు. 

More Telugu News