Bandi Sanjay: ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తా: ఢిల్లీలో బండి సంజయ్

Bandi Sanjay meets JP Nadda in Delhi

  • నడ్డాకు శాలువా కప్పి సన్మానించిన కరీంనగర్ ఎంపీ
  • తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న బండి సంజయ్
  • కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా

అధిష్ఠానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ నేత బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నడ్డాకు శాలువా కప్పి సన్మానించారు. ఈ నెల ప్రారంభంలో బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుండి సంజయ్‌ని తప్పించి, కిషన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బండి సంజయ్‌కు అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నేపథ్యంలో నేడు పార్టీ సీనియర్ నేత రాధమోహన్ అగర్వాల్‌తో కలిసి నడ్డాను కలిశారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణలో తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

Bandi Sanjay
JP Nadda
BJP
Telangana
  • Loading...

More Telugu News