BRO Success Meet: మావయ్య గురించి మాట్లాడేంత అనుభవం నాకు లేదు: 'బ్రో' సక్సెస్ మీట్ లో సాయితేజ్

BRO Success Meet

  • ఈ నెల 28న విడుదలైన 'బ్రో'
  • 3 రోజుల్లో 100 కోట్లకి దగ్గరగా వెళ్లిన సినిమా 
  • సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్ 
  • ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పిన సాయితేజ్ 
  • కల్యాణ్ మావయ్య గురించి మాట్లాడే అర్హత తనకి లేదని వెల్లడి

తమిళంలో తాను తెరకెక్కించిన 'వినోదయా సితం' సినిమాను 'బ్రో' టైటిల్ తో సముద్రఖని రీమేక్ చేశాడు. పవన్ కల్యాణ్ - సాయితేజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - మాటలు త్రివిక్రమ్ అందించారు. తమన్ బాణీలను సమకూర్చాడు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన 'బ్రో' 3 రోజుల్లోనే 100 కోట్లకు దగ్గరగా వెళ్లింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. దర్శక నిర్మాతలతో పాటు సాయితేజ్ .. కేతిక శర్మ హాజరయ్యారు. అలాగే దర్శకులు బాబీ ... మారుతి ... చందూ మొండేటి .. శ్రీవాస్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సినిమా సాధించిన సక్సెస్ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్కండేయ పాత్రను పోషించిన సాయితేజ్ ఈ సినిమాను గురించి మాట్లాడాడు. 

"సముద్రఖని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా మావయ్య కల్యాణ్ గారి గురించి .. త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అర్హత .. అనుభవం నాకు లేవు. ఇక తమన్ నా ఫ్రెండ్ అయినా, నేను తన అభిమానిగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.

BRO Success Meet
Pavan Kalyan
Sai Tej
Kethika
BRO
  • Loading...

More Telugu News