heart attack: హైదరాబాద్‌లో గుండెపోటుతో ఎంబీఏ విద్యార్థి మృతి

mba student died due to heart attack

  • ఆదివారం రాత్రి బాత్‌రూమ్‌లో కుప్పకూలిన కుశాల్
  • మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో గుండెనొప్పి?
  • పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలింపు

హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ విద్యార్థి చనిపోయాడు. కుశాల్ అనే స్టూడెంట్‌ హాస్టల్‌లో ఉన్న సమయంలో హార్ట్ అటాక్ రావడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎంబీఏ తొలి సంవత్సరం చదువుతున్న కుశాల్‌.. పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని మైసమ్మగూడలో హాస్టల్‌లో ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బాత్‌రూమ్‌లో కుప్పకూలాడు. మూత్ర విసర్జనకు వెళ్లిన సమయంలో గుండెనొప్పి వచ్చి ఉండొచ్చని, ఎవరూ గమనించి ఉండకపోవడంతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కుశాల్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుశాల్‌ గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతడు కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

heart attack
mba student
Hyderabad
Petbasheerabad
student died
  • Loading...

More Telugu News