Jr NTR: ‘దేవర’లో ఎన్టీఆర్​ ఏ రేంజ్‌లో భయపెడతాడో చెప్పిన కొరటాల శివ

250 days to witness fear unleash on the big screen DEVARA

  • కొరటాల శివ దర్శకత్వంలో దేవరలో నటిస్తున్న ఎన్టీఆర్
  • వచ్చే ఏప్రిల్ 5న విడుదల కానున్న చిత్రం
  • ప్రత్యేక వీడియోను విడుదల చేసిన చిత్ర బృందం 

ఆర్ఆర్ఆర్‌‌తో గ్లోబల్ స్టార్‌‌గా మారిన టాలీవుడ్ యంగ్‌ టైగర్ జూనియర్‌‌ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్‌ చిత్రంతో తన కెరీర్‌‌లో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రంతో అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్‌ కు పరిచయం కాబోతుంది.  సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా శంషాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ప్రత్యేక సెట్‌లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. 250 రోజుల్లో సినిమా విడుదల కాబోతోందంటూ ఓ ప్రత్యేక వీడియోను చిత్ర బృందం నిన్న సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో కొరటాల శివ మాట్లాడుతూ ‘దేవర’లో ఎన్టీఆర్‌‌ పాత్రపై అంచనాలు పెంచేశారు. ‘ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాలు ఉంటాయి. వాళ్లకు దేవుడు, చావు అంటే భయం లేదు. ఒకే ఒక్కటంటే భయం. ఆ భయం ఉండాలి.. అవసరం. భయపెట్టడానికి ఈ సినిమా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌ కు వెళ్తుందనేది ఎమోషనల్ రైడ్’ అంటూ చెప్పుకొచ్చారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Jr NTR
Koratala Siva
devara
movie
250 days

More Telugu News