Volunteer: విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

Volunteer killed old women in Vizag

  • 73 ఏళ్ల వరలక్ష్మిని హత్య చేసిన వాలంటీర్ వెంకటేశ్
  • నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో హత్య
  • కొంత కాలంగా ఆమె షాపులో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న వెంకటేశ్

విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే వృద్ధురాలిని వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేశ్ హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన వరలక్ష్మి వయసు 73 సంవత్సరాలు. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఆమెను హత్య చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

పెందుర్తి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో ఆధారాలను సేకరిస్తున్నారు. వరలక్ష్మి ముఖంపై దిండుతో అదిమి, ఊపిరి ఆడకుండా చేసి ఆమెను హత్య చేసినట్టు క్లూస్ టీమ్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం కోసమే వెంకటేశ్ ఈ హత్య చేసినట్టు భావిస్తున్నారు. నిన్న రాత్రి వృద్ధురాలు ఇంటికి వెంకటేశ్ వచ్చి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.

Volunteer
Vizag
Murder
  • Loading...

More Telugu News