Devineni Uma: అక్రమార్జన బయటపడుతుందనే హైదరాబాద్‌కు సజ్జల మకాం: దేవినేని

TDP leader Devineni sensational comments on Sajjala

  • సజ్జల తన మకాంను హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు మార్చారన్న ఉమ
  • వైసీపీ ప్రభుత్వానికి ఇక మిగిలింది ఆరు నెలలేనన్న టీడీపీ నేత
  • వివేకా హత్య కేసులో త్వరలోనే ఏ9, ఏ10 నిందితుల పేర్లు కూడా వస్తాయన్న దేవినేని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మైలవరంలో నిన్న టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమార్జన బయటపడుతుందన్న భయంతోనే సజ్జల తన మకాంను హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు మార్చారని ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది ఇక ఆరు నెలలేనని చెప్పారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను తప్పుబడుతూ నిందితుడే సీబీఐకి లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ఈ కేసులో ఏ8గా అవినాష్‌రెడ్డి ఉన్నారని, త్వరలో ఏ9, ఏ10 పేర్లు కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు. అందుకనే తాడేపల్లి ప్యాలెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు.

Devineni Uma
Sajjala Ramakrishna Reddy
TDP
YS Vivekananda Reddy
  • Loading...

More Telugu News