Vijay Sai Reddy: మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం.. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ysrcp mp vijayasai reddy satires on daggubati purandeswari

  • బీజేపీ అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదన్న విజయసాయిరెడ్డి
  • బాబుది స్క్రిప్ట్‌.. వదినది డైలాగ్‌ అంటూ మండిపాటు
  • తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్లలో ఆనందమే టార్గెట్ అంటూ విమర్శలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ మాత్రమే మహానటులని అనుకున్నామని, ఆయన కూతురు పురందేశ్వరి కాదనుకున్నామని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘అమ్మా పురందేశ్వరిగారు.. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్‌.. వదినది డైలాగ్‌! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్లలో ఆనందమే టార్గెట్!” అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

‘‘మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు.. అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!” అంటూ మండిపడ్డారు. 2013లో పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి పురందేశ్వరి గతంలో చేసిన ప్రకటనను షేర్ చేశారు.

Vijay Sai Reddy
Daggubati Purandeswari
Chandrababu
Telugudesam
BJP
NTR
YSRCP

More Telugu News