Brahmanandam: తన కుమారుడి పెళ్లికి రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన బ్రహ్మానందం

Brahmanandam invites CM KCR for his son wedding

  • త్వరలో బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం
  • ప్రగతి భవన్ కు వెళ్లిన బ్రహ్మానందం
  • సీఎం కేసీఆర్ కు శుభలేఖ అందజేత
  • తిరుమల శ్రీవారి పెన్సిల్ డ్రాయింగ్ బహూకరణ

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బ్రహ్మానందం చిన్నకుమారుడు సిద్ధార్థ్ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో జరగనుంది. ఈ నేపథ్యంలో, తన కుమారుడి పెళ్లికి రావాలంటూ బ్రహ్మానందం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. 

ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లిన బ్రహ్మానందం... సీఎం కేసీఆర్ కు పెళ్లి కార్డు అందజేశారు. పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులకు ఆశీస్సులు అందించాలని కోరారు. 

కాగా, తన నివాసానికి వచ్చిన బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. బ్రహ్మీని ఆప్యాయంగా హత్తుకున్నారు. పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన తిరుమల శ్రీవారి పెన్సిల్ డ్రాయింగ్ ను కూడా బ్రహ్మానందం సీఎం కేసీఆర్ కు బహూకరించారు.

More Telugu News