BTech Ravi: బెదిరింపులకు భయపడి అజేయ కల్లం మాట మార్చడం సిగ్గుచేటు: బీటెక్ రవి

BTech Ravi slams Ajeya Kallaym

  • వివేకా హత్య కేసులో అజేయ కల్లం వాంగ్మూలం నమోదు
  • సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని తాజాగా అజేయ కల్లం ఆరోపణ
  • అజేయ కల్లం రోజుకో మాట మాట్లాడుతున్నారన్న బీటెక్ రవి
  • తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు చెప్పినట్టుగా కల్లం నటిస్తున్నారని విమర్శలు

వివేకా హత్య కేసుకు సంబంధించి తన వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించిందని ఏపీ సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు.

దశాబ్దాల పాటు అత్యున్నత స్థాయి పదవుల్లో ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అజేయ కల్లం తాడేపల్లి ప్యాలెస్‌ బెదిరింపులకు భయపడి వివేకా హత్య కేసులో రోజుకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సీబీఐ అధికారులు తనతో చిట్‌చాట్‌ చేశారని ఒకసారి, స్టేట్‌మెంట్‌ ఇచ్చానని మరోసారి, ఇప్పుడు వక్రీకరించారంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని బీటెక్ రవి నిలదీశారు.

"వాస్తవాలు చెప్పినందుకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన బెదిరింపులకు తలొగ్గి మాట మారుస్తున్నారు. 161 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చానన్న విషయం కూడా అజేయ కల్లం మరిచిపోయారా?

భారతీరెడ్డి పిలుపుతో పైకి వెళ్లి వచ్చిన తర్వాత వివేకా గుండెపోటుతో చనిపోయారన్న విషయం జగన్‌రెడ్డే స్వయంగా చెప్పారని అజేయ కల్లం బయట్టబయలుచేశారు. అయితే, రాష్ట్రంలో బాత్‌రూమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందనే భయంతో తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు చెప్పిన విధంగా కల్లం నటిస్తున్నారు. 

తెల్లవారుజామున లోటస్‌పాండ్‌లో జరిగిన ఆంతరంగిక సమావేశంలో పాల్గొన్న అజేయ కల్లం... వివేకా చనిపోయారని జగన్‌ చెప్పిన వెంటనే ఎలా చనిపోయారని అడగలేదా? ఎన్ని గంటలకో మీటింగ్‌ తెలియకుండానే లోటస్‌పాండ్‌కు వెళ్లి కూర్చున్నారా? చెప్పని మాటలు చెప్పినట్లు సీబీఐ ప్రచారం చేస్తోందన్న దానిపై ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అంటూ బీటెక్ రవి ప్రశ్నల వర్షం కురిపించారు.

BTech Ravi
Ajeya Kallam
YS Vivekananda Reddy
Murder Case
CBI
  • Loading...

More Telugu News