Sai Dharam Tej: అంబటి రాంబాబు గారు డ్యాన్స్ బాగా చేశారు: సాయిధరమ్ తేజ్

Ambati Rambabu dance is very good says Sai Dharam Tej
  • 'బ్రో' సినిమాలో పృథ్వీ డ్యాన్స్ పై వివాదం
  • అంబటి డ్యాన్స్ ను అనుకరించలేదన్న సాయితేజ్
  • అంబటికి మీసాలు ఉంటాయి.. పృథ్వీకి లేవని వ్యాఖ్య
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఏపీలో హాట్ టాపిక్ గా మారారు. సంక్రాంతి సందర్భంగా ఆయన స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి ఆయన వేసిన డ్యాన్స్ అప్పట్లో వైరల్ అయింది. అదే డ్యాన్స్ ను ఇప్పుడు పవన్ కల్యాణ్ 'బ్రో' సినిమాలో పృథ్వీ చేత వేయించారు. దీనిపై అంబటి విమర్శలు గుప్పించారు. 

మరోవైపు ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, నిర్మాత విశ్వప్రసాద్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ ను సినిమాలో పెట్టారనే విషయాన్ని యాంకర్ లేవనెత్తారు. దీనికి సమాధానంగా అలాంటిది ఏమీ లేదని సాయితేజ్ చెప్పారు. ఆరోజు డ్యాన్స్ చేసిన సందర్భంగా అంబటి వేసుకున్న టీషర్ట్, ప్యాంట్, షూ లాంటివే ఈ సినిమాలో కూడా పృథ్వీ వేసుకున్నారని యాంకర్ తెలిపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ... ఇద్దరి హెయిర్ స్టైల్ వేరుగా ఉందని, పృథ్వీకి మీసాలు లేవని చెప్పారు. మరోవైపు అంబటి రాంబాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేశారని కితాబునిచ్చారు.
Sai Dharam Tej
Tollywood
Pruthvi
Ambati Rambabu
YSRCP

More Telugu News