Vishwak Sen: మాస్ లుక్ ను సెట్ చేసుకున్న విష్వక్సేన్!

Vishwaksen 11th movie update

  • మాస్ ఆడియన్స్ లో విష్వక్సేన్ కి ఫాలోయింగ్ 
  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ
  • కెరియర్ పరంగా విష్వక్ కి 11వ సినిమా  
  • ఈ నెల 31వ తేదీన టైటిల్ ఎనౌన్స్ మెంట్

విష్వక్సేన్ కి ఇటు యూత్ లోను .. అటు మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన 'ఓరి దేవుడా' .. 'దాస్ కా ధమ్కీ' సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 11వ సినిమా. 

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 31వ తేదీన ఉదయం 10:19 నిమిషాలకు టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. అదే సమయంలో ఫస్టు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ పోస్టర్ పై చెవి పోగుతో .. పూల చొక్కాతో .. దమ్ముకొడుతూ మాస్ లుక్ తో విష్వక్ కనిపిస్తున్నాడు. 

ఇంతవరకూ విష్వక్ మాస్ యాక్షన్ అనేది తన బాడీ లాంగ్వేజ్ లోను  .. డైలాగ్స్ లోను చూపిస్తూ వచ్చాడు. మొదటిసారిగా ఆయన మాస్ లుక్ తో కనిపించనున్నాడని తెలుస్తోంది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Vishwak Sen
Krishna Chaitanya
Yuvan Shankar Raja
  • Loading...

More Telugu News