: వీడిన టీచర్ లీల కిడ్నాప్ మిస్టరీ
హైదరాబాదులో టీచర్ లీల కిడ్నాప్ మిస్టరీ వీడింది. లీలను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆమె స్వయంగా ఇల్లు వదిలి వెళ్లినట్లు తెలిపిందని డీసీపీ యోగానంద్ తెలిపారు. ఈ కేసులో లీలను వేధింపుకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సుధీర్ ను సస్పెండ్ చేశామని పోలీసులు చెప్పారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోను, మెస్సేజ్ సంభాషణలను పూర్తిగా పరిశీలించాక మిగిలిన విషయాలు వెల్లడిస్తామని యోగానంద్ తెలిపారు. శనివారం కూడా లీలను కోర్టులో హజరు పర్చుతామని, ఈ కేసులో విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ యోగానంద్ అన్నారు.