Bandi Sanjay: బండి సంజయ్ కు కీలక బాధ్యతలను అప్పగించిన బీజేపీ హైకమాండ్

Bandi Sanjay appointed in key post

  • జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కు బాధ్యతల అప్పగింత
  • జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగింపు
  • జాతీయ కార్యదర్శిగా సత్య కుమార్ కు మరోసారి అవకాశం

తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సత్య కుమార్ కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించింది. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించిన తర్వాత ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కీలక నేతలు కొందరు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా చూశాం. తాజాగా సంజయ్ కు జాతీయ స్థాయిలో బాధ్యతలను అప్పగించడంపై వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Bandi Sanjay
BJP
DK Aruna
Satya Kumar
  • Loading...

More Telugu News