Bengaluru: బెంగళూరులో అద్దెకు ఫ్లాట్.. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 25 లక్షలు!

Bengaluru Flat Listed for Rs 25 Lakh Deposit in no broker app

  • నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిన ఓ అద్దె ఫ్లాట్
  • ఇంట్లో నాలుగు బెడ్ రూంలు,  విస్తీర్ణం 5,915 చదరపు మీటర్లు 
  • నెలకు రూ. 2.5 లక్షల అద్దె, జనాలకు షాక్

బెంగళూరు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది సామాన్యుల నడ్డి విరిచే జీవన వ్యయాలు, ట్రాఫిక్ రద్దీ! అయితే, తాజాగా ఘటన మాత్రం నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక్కడ బతకాలంటే కిడ్నీలు అమ్ముకోక తప్పదేమో అంటూ జనాలు గగ్గోలు పెడుతున్నారు. వారి నైరాశ్యానికి కారణం ఓ అద్దె ఫ్లాట్. నాలుగు బెడ్ రూంలు ఉన్న ఆ ఫ్లాట్ అద్దె నెలకు ఏకంగా రూ. 2.5 లక్షలట. ఇదే ఎక్కువనుకుంటే..రూ.25 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాలట. 

నో బ్రోకర్ యాప్‌లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 5,195 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉందని ఆ నెటిజన్ పేర్కొన్నారు. అయితే, ఈ ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ అంశం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. దాని కిందే లోన్ పొందే ఆప్షన్ కూడా ఉండటంతో జనాల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. లోన్ ఆప్షన్‌తో పాటూ పక్కనే కిడ్నీ దానానికి సంబంధించి ఆప్షన్ కూడా ఉంటే బాగుండేదంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

More Telugu News