Dharmana Prasad: వర్షాలు పడితే రహదారులు బురద అవుతాయి మరి.. ప్రతిపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్

AP Minister Dharmana Slams Opposition

  • ఏమీ తోచకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్న మంత్రి
  • సమగ్ర భూ సర్వే వల్ల వివాదాలు పరిష్కారమవుతున్నాయన్న ధర్మాన
  • కోటబొమ్మాలి మండలంలో సచివాలయ భవనం ప్రారంభం

జగనన్న కాలనీల్లో నీళ్లు చేరాయని, రహదారులు బురద గుంతల్లా మారాయన్న ప్రతిపక్షాల విమర్శలపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని రేగుగులపాడులో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. 

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వర్షాలు పడితే వాగులు పొంగవా? రహదారులు బరద కావా? కాలనీల్లోకి నీళ్లు చేరవా? అని ప్రశ్నించారు. ఏమీ తోచకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వే వల్ల వివాదాలు పరిష్కారమవుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 27 లక్షల ఎకరాల భూమిపై హక్కులు కల్పించినట్టు మంత్రి తెలిపారు.

Dharmana Prasad
YSRCP
Srikakulam District
  • Loading...

More Telugu News