Naresh: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి దూసుకుపోతున్న 'మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌`!

Maya Bazaar Web Series Update

  • జీ 5 నుంచి వచ్చిన 'మాయా బజార్ ఫర్ సేల్'
  • కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • దర్శకత్వం వహించిన గౌతమి చిల్లగుల్ల  
  • ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్

వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ తో దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 అందించిన స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. సీనియ‌ర్ న‌రేష్‌, న‌వ‌దీప్‌, ఈషా రెబ్బా, హ‌రి తేజ‌, ర‌వివ‌ర్మ‌, త‌రుణ్ భాస్క‌ర్ త‌దితరులు నటించారు. జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన 'స్పిరిట్ మీడియా' క‌లిసి హృద్య‌మైన డ్రామాగా 'మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌'ను రూపొందించారు. 

ఈ కథ గేటెడ్ క‌మ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌత‌మి చిల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందిన ఈ వెబ్ ఒరిజిన‌ల్ జీ5లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో దూసుకెళ్తూ 100 మిలియ‌న్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను క్రాస్ చేసింది. రానా ద‌గ్గుబాటి స్పిరిట్ మీడియా రూపొందించిన తొలి వెబ్ సిరీస్ కు  అమేజింగ్ రెస్పాన్స్ రావ‌టంపై ఎంటైర్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారు. 

ఈ సంద‌ర్భంగా... జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ .. ‘‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్‌కు అతి కొద్ది స‌మ‌యంలోనే చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం సంతోషంగా ఉంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల అద్భుత‌మైన వ‌ర్క్ కార‌ణంగా ఈ రిజ‌ల్ట్ వ‌చ్చింది. భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి మంచి కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాం’’ అన్నారు. 

జీ 5 చీఫ్ కంటెంట్ ఆఫీస‌ర్ అనూరాధ గూడూరు మాట్లాడుతూ .. ‘మాయాబజార్ ఫర్ సేల్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించ‌టం సంతోషం. ఈ నెంబ‌ర్ ఇంకా పెరుగుతుంది. జీ 5 కంటెంట్ లైబ్ర‌రీలో మ‌రో అద్భుత‌మైన వెబ్ సిరీస్ చేరింది. మంచి కంటెంట్‌ను ఆద‌రిస్తామ‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ప్రూవ్ చేశారు. రానా ద‌గ్గ‌బాటిగారి స్పిరిట్ మీడియాతో వ‌ర్క్ చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు. 

ప్రొడ్యూస‌ర్ రాజీవ్ రంజ‌న్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కథలను ఆడియెన్స్‌కి అందించ‌ట‌మే స్పిరిట్ మీడియా ఉద్దేశం. అలా ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా తెర‌కెక్కించిన ‘మాయాబజార్ ఫర్ సేల్’ సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సిరీస్ వ‌చ్చిన కొద్ది స‌మ‌యంలోనే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించ‌టంపై సంతోషంగా ఉన్నాం’’అన్నారు. 

జీ5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయితేజ మాట్లాడుతూ ‘‘కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్ మా మాయబజార్. అందుక‌నే ఈ సిరీస్‌ను ఆడియెన్స్ అంత‌లా ఆదరిస్తున్నారు. రానా ద‌గ్గుబాటి స్పిరిట్ మీడియాతో క‌లిసి ప‌ని చేసిన ‘మాయాబజార్ ఫర్ సేల్’కు ఇంత మంచి ఆద‌ర‌ణ రావ‌టం చాలా సంతోషం.  సకుటుంబ సపరివార సమేతంగా చూసే సిరీస్ ఇది" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News