Samudrakhani: 'బ్రో' పవన్ తోనే చేయడానికి కారణమిదే: సముద్రఖని

Samudrakhani Interview

  • ఈ రోజునే థియేటర్లలో దిగిపోయిన 'బ్రో'
  • పవన్ తో చేసింది ఒక్కటే సినిమానన్న సముద్రఖని
  • ఆయనతో ఇంతకుముందు పరిచయం లేదని వెల్లడి 
  • ఈ పాయింట్ ఆయన చెబితేనే బాగుంటుందని వ్యాఖ్య

పవన్ కల్యాణ్ - సముద్రఖని కాంబినేషన్ లో రూపొందిన 'బ్రో' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. పవన్ ఇమేజ్ కి ఏ మాత్రం సంబంధం లేని ఒక కథను తీసుకొచ్చి, ఆయన ద్వారానే ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సముద్రఖని మంచి మార్కులు కొట్టేశాడు. చాలా గ్యాప్ తరువాత మళ్లీ పవన్ తన ఎనర్జీ లెవెల్స్ తో కనిపించాడు. తన ఫ్యాన్స్ ను హుషారెత్తించాడు. 

అలాంటి ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ .. "ఇంతకుముందు పవన్ తో నేను 'భీమ్లా నాయక్' సినిమా మాత్రమే చేశాను .. అది కూడా ఒక రోజు షూటింగు. అందువలన ఆయనతో మాట్లాడటం కుదరలేదు .. అంతకుముందు ఆయనతో పరిచయం కూడా లేదు. పవన్ కల్యాణ్ గారి స్వభావానికీ .. ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్న అంశాలకు దగ్గర సంబంధం ఉంది. అందువలన ఆయనతోనే చేయాలనుకున్నాను. 

'భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు .. ఈ క్షణాన్ని ఎంజాయ్ చెయ్' అనేది నేను చెప్పాలనుకున్న విషయం. తమిళంలో నేను చేసిన సినిమా ద్వారా ఈ పాయింట్ ఓ 30 శాతం మందికి కనెక్ట్ అయ్యుండొచ్చు. కానీ అదే పాయింటును పవన్ కల్యాణ్ గారితో చెప్పించడం వలన 100 శాతం రీచ్ అవుతుంది. ఇదే మాట ఆయనతోను చెప్పాను .. అందుకే ఒప్పుకున్నారు కూడా" అని చెప్పుకొచ్చారు.

Samudrakhani
Pavan Kalyan
Sai Tej
BRO
  • Loading...

More Telugu News