Sreeleela: బన్నీ సినిమాలో మెరిసే ఛాన్స్ వదులుకున్న శ్రీలీల!

Sreeleela Special

  • హీరోయిన్ గా వరుస సినిమాలతో శ్రీలీల
  • రవితేజతో మరోసారి జోడీ కట్టేందుకు రెడీ 
  • ఐటమ్ సాంగ్స్ పట్ల ఆసక్తిని చూపని శ్రీలీల
  • మూడేళ్లవరకూ ప్రాజెక్టులను సెట్ చేసుకున్న బ్యూటీ  

తెలుగులో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ గా శ్రీలీల కనిపిస్తోంది. ఇంతవరకూ తెలుగులో శ్రీలీల చేసింది రెండు సినిమాలే .. వాటిలో ఒకటి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్. అయితే ఇప్పుడు ఆమె చేతిలో 10 సినిమాల వరకూ ఉన్నాయి. చర్చల దశలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మూడేళ్ల పాటు వరుసగా ఆమె సినిమాలు థియేటర్లకు రానున్నాయి.

అలాంటి శ్రీలీలకి 'పుష్ప 2' సినిమా నుంచి ఆఫర్ వచ్చినట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ను శ్రీలీలతో చేయిస్తే ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారట. అయితే ఇప్పట్లో ఈ తరహా సాంగ్స్ చేసే ఆలోచన లేదని ఆమె తేల్చిచెప్పినట్టుగా సమాచారం. 

శ్రీలీల కెరియర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. రామ్ .. నితిన్ .. విజయ్ దేవరకొండ .. వైష్ణవ్ తేజ్ .. నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో ఆమె చేస్తోంది. హీరోయిన్ గా ఆమె ఇంకా నిలదొక్కుకునే స్టేజ్ లోనే ఉంది గనుక, ఐటమ్ సాంగ్ కి నో చెప్పి ఉంటుంది. ఇక తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె మరోసారి రవితేజ జోడీ కట్టనున్నట్టుగా తెలుస్తోంది. 

Sreeleela
Ram
Nithin
Vijay Devarakonda
Raviteja
  • Loading...

More Telugu News