Akira Nandan: సుదర్శన్ థియేటర్ వద్ద పవన్ కొడుకు అకీరా నందన్... జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. వీడియో ఇదిగో!

Akira Nandan at Sudarshan Theater

  • ఈ రోజు విడుదలైన పవన్, సాయి తేజ్ 'బ్రో'
  • హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్దకు వచ్చిన అకీరా
  • అకీరాతో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తిన అభిమానులు

'బ్రో' సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. థియేటర్ల వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల సందడి మామూలుగా లేదు. మరోవైపు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా థియేటర్ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కు అకీరా వచ్చాడు. ఒక ఖరీదైన కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

అకీరాను చూసిన పవన్ ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. అకీరా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా అకీరా ఆరంగేట్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

Akira Nandan
Pawan Kalyan
Tollywood
Bro Movie
Hyderabad
Sudarshan Theater

More Telugu News