SSC Notification: 1,324 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

SSC JE 2023 notification released

  • ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
  • ఆగస్టు 16 తో ముగియనున్న గడువు
  • అక్టోబర్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) శుభవార్త చెప్పింది. వెయ్యికి పైగా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు గడువును ఆగస్టు 16 గా నిర్ణయించినట్లు తెలిపింది. అభ్యర్థులకు నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షను అక్టోబర్ లో షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ లింక్..

ఖాళీలు: 1,324
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులు మాత్రమే) జేఈ(సీ): 431, జేఈ(ఈఅండ్ఎం): 55
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జేఈ(సీ): 421, జేఈ(ఈ): 124
సెంట్రల్ వాటర్ కమిషన్ జేఈ(సీ): 188. జేఈ(ఎం): 23
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జేఈ(సీ): 15, జేఈ(ఎం): 6
మిలిటరీ ఇంజినీర్ సేవలు జేఈ(సీ): 29, జేఈ(ఈఅండ్ఎం): 18
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) జేఈ(సీ): 7, జేఈ(ఎం): 1
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జేఈ(సీ): 4, జేఈ(ఈ): 1, జేఈ(ఎం): 1

అర్హతలు: దరఖాస్తు చేసే పోస్టును అనుసరించి అభ్యర్థుల అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు మినహాయింపు)

దరఖాస్తు విధానం: ఎస్ఎస్ సీ అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

SSC Notification
Jobs
central govt jobs
job notification
junior engineer ssc
  • Loading...

More Telugu News