Dolphin: ఏపీ, ఒడిశా తీరంలో డాల్ఫిన్లు.. తిమింగలాలు

Dolphins and Whales Spotted In AP And Odisha Coast

  • ఇండియన్ ఎకనమిక్ జోన్  పరిధిలో ఎఫ్ఎస్ఐ సర్వే
  • 10,416 డాల్ఫిన్లు, 27 తిమింగలాల గుర్తింపు
  • మచిలీపట్టణం, కాకినాడ, బారువా తీరాల్లో సంచరిస్తున్న క్షీరదాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్టణం, కాకినాడ, బారువతోపాటు ఒడిశా తీరాల్లో డాల్ఫిన్లు, తిమింగలాలను గుర్తించారు. ఇండియన్ ఎకనమిక్ జోన్ పరిధిలోని తీరం నుంచి 1200 నాటికల్ మైళ్ల దూరంలో నిర్వహించిన సర్వేలో 10,416 డాల్ఫిన్లు, 27 తిమింగలాలను గుర్తించినట్టు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) తెలిపింది. ఒక్క తూర్పు తీరంలోనే 2,703 డాల్ఫిన్లు, 4 తిమింగలాలను గుర్తించినట్టు పేర్కొంది. 

డాల్ఫిన్లలో 16 రకాలు ఉండగా తూర్పు తీరంలో ఆరు రకాలు సంచరిస్తున్నాయి. పాంట్రాపికల్ స్పాడెట్ రకానికి చెందిన దాదాపు 700 డాల్పిన్లు మచిలీపట్టణం, కాకినాడ పరిసరాల్లో గుర్తించారు. స్పిన్నర్ రకానికి చెందిన 700 డాల్ఫిన్లను కాకినాడ, బారువా, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో గుర్తించారు. రిస్సో రకానికి చెందిన 150 డాల్ఫిన్లను పారాదీప్ ప్రాంతంలో కనుగొన్నారు. డాల్ఫిన్ల సర్వే కోసం విశాఖ అధికారులు ‘మత్స్యదర్శిని’ నౌకను ఉపయోగించారు.

  • Loading...

More Telugu News