Margani Bharat: గత ప్రభుత్వ అప్పులను కూడా మా ఖాతాలో వేస్తున్నారు: పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ మార్గాని ఫైర్

Margani Bharat Slams AP BJP Chief Purandeswari Over AP Debts
  • నిన్న రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడిన భరత్
  • వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పురందేశ్వరికి హితవు
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని స్పష్టీకరణ
కేంద్రమాజీ మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా పురందేశ్వరి తమ ఖాతాలో వేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని ఎంపీ స్పష్టం చేశారు. కాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.
Margani Bharat
YSRCP
Daggubati Purandeswari

More Telugu News