Uttar Pradesh: భర్తను చంపి ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన భార్య!

woman kills husband and cuts body into 5 pieces
  • ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఘటన
  • భర్త నిద్రిస్తుండగా మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపిన భార్య
  • శరీర భాగాల కోసం కాల్వలో గాలిస్తున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ దారుణానికి తెగబడింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికేసింది. ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా చేసి కాల్వలో పడేసింది. పిలిభిత్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. గుజ్రాలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన 55 ఏళ్ల రాంపాల్ భార్య దులారో దేవి కొన్ని రోజులుగా భర్త స్నేహితుడితో కలిసి ఉంటోంది. నెల రోజుల క్రితం ఆమె తిరిగి గ్రామానికి చేరుకుంది.

ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ సమీపంలోనే భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్న కుమారుడికి చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దులారో దేవి ప్రవర్తనను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పింది విని పోలీసులు షాకయ్యారు.

భర్తను తానే చంపేసినట్టు అంగీకరించింది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని, ఆ తర్వాత ఐదు ముక్కలుగా కోసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Uttar Pradesh
Crime News
Pilibhit

More Telugu News