USA: బియ్యానికి భారీ డిమాండ్.. అమెరికా వ్యాపారులపై కనకవర్షం

Rice prices double in america business make huge profits

  • అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు
  • బాస్మతీ బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు 
  • భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్

నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం అమెరికాలో బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. బియ్యానికి డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బియ్యం బస్తాలను జనాలు పోటీ పడి కొనుక్కుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న అంచనాల నడుమ రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతీ బియ్యం కొనుగోళ్లు పెంచినట్టు సమాచారం. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతోంది. దీనికితోడు భారత్ నిర్ణయం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సూచించింది. ఆహార ధాన్యాల ధరలు పెరిగేగొద్దీ ఇతర దేశాలు రిటాలియేటరీ చర్యలకు దిగే ప్రమాదం ఉందని కూడా పేర్కొంది.

USA
Rice prices
Rice Export Ban
India
  • Loading...

More Telugu News