rains: హమ్మయ్య.. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్లే!

IMD Rain forecast in Telangana

  • మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని వెల్లడి
  • తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా నమోదు
  • ఆగస్ట్ రెండో వారంలో, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కాస్త ఊరట కల్పించే వార్తను చెప్పింది. వర్షాలు ఇక తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేటి ఉదయం బలహీనపడిందని, మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని చెప్పారు. తెలంగాణలో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా నమోదయినట్లు తెలిపారు.

కొన్ని జిల్లాల్లో అసాధారణ భారీ వర్షాలు కురిశాయన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని, అయితే ఆగస్ట్ రెండో వారంలో, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. గురు, శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అయితే ఆ తర్వాత మూడు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవన్నారు.

rains
Hyderabad
Telangana
imd
  • Loading...

More Telugu News