rains: జనగామ జిల్లాలో వాగు దాటుతూ నీళ్లలో కొట్టుకుపోయిన ఆటో.. డ్రైవర్ ను కాపాడిన స్థానికులు

Biker slips in to canal in Hanmakonda

  • కన్నారం వద్ద బైక్‌పై వెళ్తూ కొట్టుకుపోతున్న ఇద్దర్ని కాపాడిన స్థానికులు
  • భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
  • అవసరమైతే రంగంలోకి దిగడానికి రెండు హెలికాప్టర్లు సిద్ధం 

హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ బైక్ పై వెళ్తున్న ఇద్దరు కొట్టుకుపోయారు. అయితే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కాపాడారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

మరోవైపు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట వాగు భారీగా ప్రవహిస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆ వాగును దాటే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ధాటికి ఆటో వాగులో కొట్టుకుపోయింది. ఆటో డ్రైవర్ వెంటనే బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. 

మరోవైపు, హంటర్ రోడ్డులోని ఓ గర్ల్స్ హాస్టల్ నీట మునిగింది. హాస్టల్లో 200 మంది వరకు విద్యార్థినులు చిక్కుకున్నారు. అర్ధరాత్రి ఒకటి గంట నుండి వారు హాస్టల్ బిల్డింగ్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద నీటిని తోడివేయడానికి బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడేం జరిగినా రంగంలోకి దిగడానికి అందుబాటులో రెండు హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటిమట్టం 53 అడుగుల వరకు వెళ్తే మూడో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత వరద కాస్త శాంతించింది.

rains
Telangana
Jangaon District
Warangal Urban District
  • Loading...

More Telugu News