Tirumala: వర్షాల ప్రభావం... తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

Devotees rush declined in Tirumala due to rains

  • దేశవ్యాప్తంగా భారీ వర్షాలు
  • ప్రయాణాలు తగ్గించుకుంటున్న ప్రజలు
  • తిరుమలలో సాధారణ రద్దీ
  • సర్వదర్శనానికి 12 గంటల సమయం

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల నేపథ్యంలో వరదలు సంభవిస్తుండడంతో ప్రజలు ప్రయాణాలు తగ్గించుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీపైనా వర్షాల ప్రభావం పడింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 

టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

తిరుమల వెంకన్నను నిన్న 74,268 మంది దర్శించుకున్నారు. 26,817 మంది తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే హుండీ ద్వారా రూ.4.32 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News