Sri Vishnu: 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న 'సామజవరగమన'

Samajavaragamana movie OTT released

  • జూన్ 29న విడుదలైన 'సామజవరగమన'
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన కథాకథనాలు 
  • థియేటర్స్ వైపు నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
  • ఓటీటీ వైపు నుంచి మరిన్ని మార్కులు పడటం ఖాయమే  

ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో వచ్చిన సినిమాలలో 'సామజవరగమన' ఒకటి. శ్రీవిష్ణు - రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మించగా .. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నరేశ్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. 'ఆహా'లో రేపు స్ట్రీమింగ్ కావలసిన ఈ సినిమాను కాస్త ముందుకు జరిపి, ఈ రోజునే ట్రాక్ పైకి తెచ్చేశారు.

హైదరాబాద్ - రాజమండ్రి మధ్య ఈ కథ నడుస్తుంది. ప్రేమ - పెళ్లి అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ బోర్ కొట్టకుండా నడుస్తుంది. గతంలో హీరోయిన్స్ వైపు నుంచి చూపించిన కోణాలను, ఈ సినిమాలో హీరో వైపు నుంచి చూపిస్తూ దర్శకుడు నాన్ స్టాప్ గా నవ్వించాడు. 

తాను ఇంకా యంగ్ అనుకునే పాత్రలో నరేశ్ ఫస్టాఫ్ లో నవ్విస్తే, కులపిచ్చి ఉన్న కులశేఖర్ పాత్రలో వెన్నెల కిశోర్ నవ్వులు పూయిస్తాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి నవ్వుల శాతం మరింత పెరుగుతూ, మంచి ట్విస్ట్ తో ముగుస్తుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాకి మరింత రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Sri Vishnu
Reba Monika John
Naresh
Vennela Kishore
  • Loading...

More Telugu News