Sri Simha: నేల నుంచి నింగికి ఎగిరిన 'ఉస్తాద్' .. ట్రైలర్ రిలీజ్!

Ustaad movie update

  • శ్రీసింహా హీరోగా రూపొందిన 'ఉస్తాద్'
  • ఆయన జోడీకట్టిన కావ్య కల్యాణ్ రామ్
  • కీలకమైన పాత్రలో గౌతమ్ మీనన్ 
  • ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల  

శ్రీసింహా హీరోగా రూపొందిన 'ఉస్తాద్' విడుదలకు ముస్తాబవుతోంది. వారాహి చలనచిత్ర బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా జోడీగా ఈ సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ కనిపించనుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాస్త ఎత్తుపై నుంచి చూస్తే కళ్లు తిరిగే ఒక యువకుడు, ఆకాశంలో నుంచి నేలను చూడాలనుకుంటాడు. పాత బైక్ రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు లేని ఆ కుర్రాడు, ఏకంగా విమానం పైలెట్ కావాలనుకుంటాడు. పరిస్థితులు వెనక్కి లాగినా, ప్రేమించిన అమ్మాయి ప్రోత్సాహంతో తాను అనుకున్నది ఎలా సాధించాడు? అనేదే కథ. 

ఇదే విషయాన్ని ట్రైలర్ ద్వారా అర్థమయ్యేలా చేశారు. ప్రేమ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. ఆశయం వంటి అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీ సింహాకి ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.

More Telugu News