drunken man: తప్పతాగి పడుకున్న వ్యక్తి చొక్కాలోకి వెళ్లిన పాము.. వీడియో ఇదిగో!

A drunk man wakes up with a snake in his shirt
  • మద్యం మత్తులో అటవీ ప్రాంతంలో కునుకు తీసిన వ్యక్తి
  • లేచి చూసే సరికి చొక్కాలో నల్ల కోబ్రా పాము
  • చొక్కా బటన్లు తీసి పాము బయటికి వెళ్లేలా సాయం చేసిన యువకులు
మద్యానికి బానిసలైన కొంతమంది అతిగా తాగి ఎక్కడపడితే అక్కడే పడుకుండిపోతారు. మత్తు దిగిన తర్వాత గానీ ఎక్కడున్నామో వారికి తెలిసిరాదు. అలా పీకలదాకా తాగిన తర్వాత ఇంటికి వెళ్లకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న దానికి ఉత్తరాదిలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు. ఓ వ్యక్తి అతిగా తాగి అటవీ ప్రాంతంలో కునుకుతీశాడు. లేచి చూసేసరికి ఓ పాము అతని చొక్కాలోకి వెళ్లింది. 

ఈ దెబ్బకు తాగిన మత్తు వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాడు. అటుగా వెళ్తున్న కొందరు అతని వద్దకు వెళ్లి చూడగా.. చొక్కాలో బుసలు కొడుతున్న నల్ల కోబ్రా పామును గమనించారు. జాగ్రత్తగా అతని చొక్కా బటన్లు తీసి పాము బయటకు వెళ్లేలా సాయం చేశారు. దాంతో, ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. అంతా జరిగిన తర్వాత పాము తన చొక్కాలోకి ఎలా వచ్చిందని అతను ప్రశ్నించడం కొసమెరుపు.
drunken man
snake
shirt
forest
Viral Videos

More Telugu News