JD Chakravarthi: 'సత్య' విషయంలో వర్మ టెన్షన్ పెట్టేశాడు: జేడీ చక్రవర్తి

JD Chakravarthi Interview

  • 'సత్య' సినిమాను గురించి ప్రస్తావించిన జేడీ 
  • అమెరికా నుంచి వర్మ పిలిపించారని వెల్లడి 
  • ముంబై వెళ్లి కలిస్తే వర్మ పట్టించుకోలేదని వ్యాఖ్య 
  • తన గురించి వర్మ అలా ఆలోచన చేశాడని వివరణ

జేడీ చక్రవర్తి హీరోగా 'దయా' వెబ్ సిరీస్ రూపొందింది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ తో జేడీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'సత్య' సినిమాను గురించి ప్రస్తావించారు. 

"నేను అమెరికా వెళ్లిన రోజునే వర్మ కాల్ చేసి, వెంటనే ఇండియాకి వచ్చేయమని చెప్పారు. ముంబైలో తనని కలవమని చెప్పి, ఫోన్ పెట్టేశారు. దాంతో మళ్లీ హడావిడిగా బయల్దేరి 3వ రోజున ముంబైలో ఆయనను కలుసుకున్నాను. ఆయన ఏ విషయం చెప్పకుండా, 'నువ్వు హైదరాబాద్ వెళ్లు .. అక్కడ కలుద్దాం' అన్నారు. దాంతో డీలాపడిపోతూ తిరిగివచ్చేశాను. 

హైదరాబాద్ వచ్చాక నాకు ఫీవర్ వచ్చింది ..  ఆ సమయంలో వర్మ మా ఇంటికి వచ్చారు. అమెరికాలో కొన్న కలర్ ఫుల్ డ్రెస్ వేసుకుని ముంబైలోని వర్మ దగ్గరికి వెళ్లినప్పుడు, 'సత్య' సినిమాకి నేను సెట్ కానని అనుకున్నారట. ఆ మాట చెప్పడం కోసమే మా ఇంటికి వచ్చానని అన్నారు. అయితే ఫీవర్ తో .. కాస్త రఫ్ లుక్ తో ఉన్న నన్ను చూశాక, నన్నే తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా వర్మ చెప్పారని నవ్వేశాడు.

JD Chakravarthi
Ram Gopal Varma
Sathya Movie
  • Loading...

More Telugu News