Gudem Mahipal Reddy: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుమారుడి మృతి

- కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స
- ఈ తెల్లవారుజామున 2 గంటలకు మృతి
- విషాదంలో ఎమ్మెల్యే కుటుంబం
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన వయసు 30 సంవత్సరాలు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి మృతితో మహిపాల్‌రెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్ధన్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తరలించారు. మరికాసేపట్లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.