Nikhil: హఠాత్తుగా అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైన 'స్పై'

Spy Movie Update

  • యాక్షన్ జోనర్లో నిఖిల్ హీరోగా 'స్పై'
  • జూన్ 29న విడుదలైన సినిమా 
  • ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • ఐదు భాషల్లో అందుబాటులో ఉన్న సినిమా

నిఖిల్ హీరోగా .. యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమాగా రూపొందిన 'స్పై', జూన్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. శ్రీచరణ్ పాకాల - విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 

అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజున స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే ముందుగా ఎలాంటి పోస్టర్లు గానీ .. ట్రైలర్లు గాని లేకుండా ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఓటీటీ సెంటర్ నుంచి పోస్టర్ ను కూడా కొంతసేపటి క్రితమే వదిలారు. తెలుగుతో పాటు తమిళ ... మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. 

నిఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితమైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ప్రమోషన్స్ లో హైలైట్ చేశారు. తీరా సినిమా చూస్తే ఆ అంశానికి సంబంధించి నడిచిన కథ చాలా తక్కువ. ఇక్కడే ప్రేక్షకులు నిరాశకి గురయ్యారు. చెప్పిన అంశానికీ .. చూపించిన దానికి సంబంధం లేదనే అసంతృప్తికి లోనయ్యారు.

More Telugu News