Siddhu: 'టిల్లు' గాని క్రేజ్ అలాంటిది మరి!

Tillu Square movie update

  • డీజే టిల్లు సీక్వెల్ గా 'టిల్లు స్క్వైర్'
  • యూత్ అంతా ఈ సినిమా కోసమే వెయిటింగ్
  • అంచనాలు పెంచేస్తున్న అప్ డేట్స్ 
  • కథానాయికగా కనిపించనున్న అనుపమ

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా గతంలో వచ్చిన 'డీజే టిల్లు' వసూళ్ల వర్షం కురిపించింది. హీరో తెలంగాణ యాస .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. హీరోయిన్ గ్లామర్ .. బోల్డ్ కంటెంట్ .. ఇలా అనేక ఆసక్తికరమైన అంశాలతో ఆ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వైర్' రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. 

నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీతాన్ని అందించాడు. ఆయన పాడిన 'టిక్కెట్టే కొనకుండా' ఆసనే పాటను నిన్న వదిలారు.

ఈ పాట ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 100K లైక్స్ ను సంపాదించుకుంది. తన ఎనర్జీ లెవెల్స్ తో ఈ సాంగ్ ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఈ పాటకి ఇంత వేగంగా వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సారి కూడా టిల్లుగాడు హిట్ కొట్టేలానే ఉన్నాడు. 

More Telugu News