Vaishnavi Chaitanya: 70 కోట్ల మార్కును దాటేసిన 'బేబి'

Baby Movie Update

  • ఈ నెల 14న విడుదలైన 'బేబి'
  • మొదటి వారంలోనే 50 కోట్ల వసూళ్లు 
  • 12 రోజుల్లో 71.6 కోట్ల గ్రాస్ 
  • 100 కోట్ల చేరువలోకి వెళుతున్న సినిమా

ఈ మధ్య కాలంలో యూత్ ను ఒక ఊపు ఊపేసిన సినిమా 'బేబి' అని చెప్పాలి. ఈ నెల 14వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, మొదటి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా సాగిన ఈ సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో మొదటి రోజు నుంచి వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది.

మొదటి వారాంతానికి ఈ సినిమా 50 కోట్ల వరకూ రాబడుతుందని అనుకుంటే, రెండు రోజుల ముందుగానే ఆ మార్క్ ను టచ్ చేసింది. ఈ సినిమా విడుదలై నిన్నటితో 12 రోజులు అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమా 70 కోట్ల మార్కును దాటేసింది. 71.6 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 

ఈ వారం కొత్తగా థియేటర్లకు 'బ్రో' సినిమా వస్తోంది. అందువలన 'బేబి' వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ లోగా మరో 10 కోట్లను రాబట్టేసి, 'బ్రో'ను కాస్త తట్టుకుని నిలబడితే మాత్రం, 'బేబి' 100 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు మరింత దగ్గరవుతాయి. చూడాలి మరి 'బేబి' మేజిక్కు ఎంతవరకూ పనిచేస్తుందనేది.  

Vaishnavi Chaitanya
Anand Devarakonda
Viraj
Sai Rajesh
  • Loading...

More Telugu News