Rajeev kanakala: ఎన్టీఆర్ తో స్నేహం గురించి స్పందించిన రాజీవ్ కనకాల!

Rajeev kanakala Interview

  • ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన రాజీవ్ కనకాల
  • ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల్లో తగ్గిన అవకాశాలు 
  • ఫ్రెండ్షిప్ దెబ్బతిందంటూ ప్రచారం 
  • అలాంటిదేం లేదని చెప్పిన రాజీవ్ 

ఒకప్పుడు ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల మంచి స్నేహితులు. ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కడో ఒక చోట .. ఏదో ఒక పాత్రలో రాజీవ్ కనకాల కనిపించేవాడు. ఆ తరువాత కాలంలో రాజీవ్ ను ఎన్టీఆర్ దూరం పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో మాదిరిగా ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనిపించలేదు కూడా. దాంతో అంతా కూడా ఇది నిజమేనని అనుకున్నారు. 

'ఐ డ్రీమ్' వారికి రాజీవ్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్ననే ఎదురైంది. అందుకు రాజీవ్ స్పందిస్తూ .. "ఎన్టీఆర్ తో నా స్నేహం అలాగే ఉంది. తనకి ఇప్పుడున్న కమిట్ మెంట్లు .. బాధ్యతలు ఎక్కువ. అందువలన గతంలో మాదిరిగా కలుసుకోవడం లేదంతే.  'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేసేది నేనే కదా. రీసెంట్ గా కూడా షూటింగుకు రమ్మని కాల్ చేశాడుగానీ .. వీలుపడక పోవడం వలన నేను వెళ్లలేదు" అన్నారు. 

"ఎన్టీఆర్ తరువాత నేను ఎక్కువగా చనువుగా ఉండే స్నేహితులలో తరుణ్ .. మనోజ్ .. శివబాలాజీ కనిపిస్తారు. తరుణ్ కి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. తాను తలచుకుంటే రీ ఎంట్రీ ఇవ్వచ్చు. ఇక నా కెరియర్ విషయంలో కూడా నేను సంతృప్తికరంగానే ఉన్నాను. గతంలో ఒకే రకమైన పాత్రలు వచ్చినా, ట్రెండు మారడంతో కొత్త పాత్రలు వస్తున్నాయి" అని చెప్పుకొచ్చారు.

Rajeev kanakala
Actor
Ntr
Tollywood
  • Loading...

More Telugu News