JD Chakravarthi: 'సత్య' తరువాత నేను ఫీలై చేసింది 'దయా'నే!: జేడీ చక్రవర్తి

Dayaa Web Series Update

  • 'దయా' వెబ్ సిరీస్ చేసిన జేడీ
  • ఆగస్టు 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  • డైరెక్టర్ పవన్ సాధినేనిని వర్మతో పోల్చిన జేడీ 
  • వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి కారణం వెల్లడి

టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా వెంకటేశ్ .. రానా కూడా బరిలోకి దిగిపోయారు. అలా ఇప్పుడు జేడీ చక్రవర్తి కూడా వెబ్ సిరీస్ ల బాటపట్టాడు. ఆయన చేసిన 'దయా' వెబ్ సిరీస్ ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ నేపథ్యంలో సాక్షి టీవీతో ఈ వెబ్ సిరీస్ ను గురించి ఆయన మాట్లాడాడు. " నేను 'సత్య' తరువాత చాలా సినిమాలు చేశాను. ఆ సినిమాలన్నీ కూడా ఎంజాయ్ చేస్తూనే చేశాను. కానీ 'సత్య' తరువాత ఆ స్థాయిలో ఫీలై చేసినది మాత్రం 'దయా'నే. పవన్ సాధినేని చాలా బాగా తీశాడు అనే మాట కూడా తక్కువే అవుతుంది" అని అన్నాడు. 

పవన్ సాధినేని చాలా ఫాస్టుగా చేస్తూ వెళ్లిపోయాడు. ఫాస్టుగా చేయడం గొప్ప విషయం అని నేను చెప్పడం లేదు. అతనికి అంత క్లారిటీ ఉందని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. రామ్ గోపాల్ వర్మలో ఉన్న క్లారిటీ పవన్ సాధినేనిలో నేను చూశాను. అందువల్లనే ఈ వెబ్ సిరీస్ ను నేను 'సత్య'తో పోల్చాను. నిజానికి ఇప్పట్లో నేను తెలుగు వెబ్ సిరీస్ చేయకూడదని అనుకున్నాను. కానీ డైరెక్టర్ కథ చెప్పిన విధానం నచ్చడం వలన ఓకే అన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

JD Chakravarthi
Dayaa
Web Series
Pavan Sadhineni
  • Loading...

More Telugu News