Nikhil: నిఖిల్ 'స్పై' భారీగానే నష్టాలు తెచ్చిపెట్టిందట!

Spy Movie Update

  • ఇటీవల నిఖిల్ నుంచి వచ్చిన 'స్పై'
  • ఆడియన్స్ కి కనెక్ట్ కాని కథ 
  • తొలిరోజునే వచ్చిన నెగెటివ్ టాక్ 
  • భారీ పరాజయాల జాబితాలో చేరిన సినిమా

నిఖిల్ హీరోగా రూపొందిన 'స్పై' జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించాడు. భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో, ఐశ్వర్య మీనన్ .. సాన్య ఠాకూర్ ... మకరంద్ దేశ్ పాండే .. అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా తొలిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ తరువాత ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. దాంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనను మానుకున్నారు. బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా భారీ నష్టాలనే మూటగట్టుకుందని అంటున్నారు.  

కథలో క్లారిటీ లేకపోవడం .. విడుదల విషయంలోను ఊగిసలాట కనిపించడం .. క్లైమాక్స్ దృశ్యాలు హడావిడిగా సాగిపోతూ అసంతృప్తిని కలిగించడం పరాజయానికి ప్రధానమైన కారణాలుగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 'కార్తికేయ 2'తో తన కెరియర్లో భారీ హిట్ ను అందుకున్న నిఖిల్, ఆ వెంటనే భారీ ఫ్లాప్ ను చూడవలసి రావడం విచారించదగిన విషయమే.

Nikhil
Iswarya Menon
Sanya Thakur
Spy Movie
  • Loading...

More Telugu News