Pavan Kalyan: ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించిన కేతిక శర్మ!

Kethika Sharma Special

  • 'రొమాంటిక్' మూవీతో పరిచయమైన కేతిక
  • గ్లామర్ పరంగా యూత్ నుంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ  
  • మూడు సినిమాలు చేసినా దక్కని హిట్ 
  • 'బ్రో' సినిమా ఫలితంపైనే ఆశలు

కేతిక శర్మ .. పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఢిల్లీ బ్యూటీ. 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుందరి. ఈ సినిమా సమయంలోనే కుర్రాళ్లంతా తన గ్లామర్ గురించి మాట్లాడుకున్నారు. ఇంతకాలం పాటు తెలుగు తెరపైకి రాకుండా ఏంచేస్తున్నట్టు? అంటూ చిటపటలాడారు. ఇక ఆమె ఏ సినిమా చేసినా ఫస్టు డే చూడవలసిందే అని ఫిక్స్ అయ్యారు. 

'రొమాంటిక్' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, యూత్ లో కేతికకి గల క్రేజ్ కారణంగానే 'లక్ష్య' .. 'రంగ రంగ వైభవంగా' సినిమాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ సినిమాల ఫలితం కూడా కేతికను నిరాశ పరిచాయి. అయితే కథాకథనాల పరంగా ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయిగానీ, గ్లామర్ పరంగా కేతికకి పడవలసిన మార్కులు పడిపోయాయి. 

అందువల్లనే ఇప్పుడు ఆమెకి 'బ్రో' సినిమాలో ఛాన్స్ దొరికింది. ఆల్రెడీ 'వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన కేతిక, ఈ సినిమాలో పవన్ - సాయితేజ్ తో కలిసి నటించింది. దాంతో ఆమె చాలా తక్కువ సమయంలో ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించినట్టు అయింది. ఈ సినిమా హిట్ అయితే కేతికను వెతుక్కుంటూ మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

More Telugu News